తెరాస కంటే కాంగ్రెసే నయం! కోదండరామ్

March 13, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నిన్న తెరాస సర్కార్ కు ఒక బహిరంగ లేఖ వ్రాశారు. దానిలో ఆయన ఉద్యోగాల భర్తీ హామీపై ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని తప్పు పట్టారు. రెండేళ్ళ క్రితం అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి, మూడేళ్ళు గడిచిన తరువాత కేవలం 20,000 ఖాళీలు మాత్రమే భర్తీ చేసి, 27,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. 

ఉద్యోగాల భర్తీ గురించి ప్రశ్నిస్తే తెరాస సర్కార్ ఎందుకింత అసహనం, కోపం ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగిది వారు సంఘ విద్రోహశక్తులు, ఆరాచక శక్తులు అన్నట్లుగా తెరాస సర్కార్ మాట్లాడటం చాలా దుర్మార్గమని అన్నారు. తెరాస సర్కార్ ఈ మూడేళ్ళలో సగటున 6,700 ఖాళీలు మాత్రమే భర్తీ  చేయగా, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సగటున 7500 ఖాళీలు భర్తీ చేశాయని, ఆ లెక్కన కాంగ్రెస్ హయంలోనే ఎక్కువ ఉద్యోగాల భర్తీ జరిగినట్లు స్పష్టం అవుతోందని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. 

తెరాస సర్కార్ హయంలో ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్చ, నిరసన తెలిపే హక్కులు అన్ని హరించుకుపోతున్నాయని ప్రొఫెసర్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస కంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ బాగుండేదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖలో ఖాళీల సంఖ్య గురించి చెప్పిన లెక్కలు ఈవిధంగా ఉన్నాయి.

1. తెరాస అధికారంలోకి వచ్చినప్పటికి ఉన్న ఖాళీల సంఖ్య :                                          30,000

2. ఏపి ఉద్యోగుల స్థానంలో భర్తీ చేయవలసిన ఖాళీల సంఖ్య:                                          30,000

3. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నఖాళీల సంఖ్య:                                                   50,000

4. వివిధ శాఖలు, కార్యాలయాలలో కొత్తగా భర్తీ చేయవలసిన ఉద్యోగాల సంఖ్య:                    25,000

5. విద్యుత్ సంస్థలలో ప్రతిపాదించిన ఉద్యోగాల సంఖ్య:                                                  15,000

6. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన ఉద్యోగాల సంఖ్య:                                                      5000

7. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్లలో భర్తీ చేయవలసిన  ఉద్యోగాల సంఖ్య:                          5000                                                                        మొత్తం భర్తీ చేయవలసిన ఖాళీల సంఖ్య:                          1,60,000 


Related Post