కేంద్ర ప్రభుత్వం దేశంలో పలు ప్రధాన నగరాలు, పట్టణాలలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. వాటిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. రూ.714.73 కోట్లు వ్యయంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిస్తోంది దక్షిణ మద్య రైల్వే.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఇది ఆధునిక ‘రైల్వే గేట్ వే’ అని అభివర్ణిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తాజా చిత్రాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. వాటిని చూసినప్పుడు ఇది మనం వందలసార్లు ప్రయాణించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషనేనా? అని అనుమానం కలుగుతుంది. అంత అద్భుతంగా స్టేషన్ని నిర్మించారు.
ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేస్తూ స్కైవే కూడా నిర్మిస్తున్నారు. స్టేషన్ వద్ద పార్కింగ్ సమస్య ఉంది గనుక మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పుడు విద్యుత్ వాహనాల సంఖ్య పెరుగుతోంది కనుక స్టేషన్ ఆవరణలో, పార్కింగ్ ఏరియాలో ఎక్కడికక్కడ ఈవీ చార్జింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లోకి వెళ్ళి వచ్చేలోగా వాహనాలు ఫుల్ ఛార్జింగ్ అయ్యి రెడీగా ఉంటాయి. ప్రస్తుతం 64 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా మరో రెండు నెలల్లోపే పూర్తయ్యే అవకాశం ఉంది.
𝐒𝐞𝐜𝐮𝐧𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧 is steadily transforming into a world-class transportation hub.
— G Kishan Reddy (@kishanreddybjp) June 3, 2026
One of the busiest railway stations in India, Secunderabad, handles 𝐧𝐞𝐚𝐫𝐥𝐲 𝟏𝟖𝟎 𝐭𝐫𝐚𝐢𝐧𝐬 𝐩𝐞𝐫 𝐝𝐚𝐲 𝐰𝐢𝐭𝐡 𝐚𝐧 𝐚𝐯𝐞𝐫𝐚𝐠𝐞 𝐝𝐚𝐢𝐥𝐲… pic.twitter.com/z49eBMUFKI