అమీర్‌ పేటలో భారీ అగ్నిప్రమాదం

June 04, 2026
img

హైదరాబాద్‌లో ఎల్లప్పుడూ అత్యంత రద్దీగా ఉండే అమీర్ పేట జంక్షన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ 1043కి సమీపంలోగల ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో గల ‘కేఎస్ఆర్‌ ఫ్యాషన్స్’లో షార్ట్ సర్క్యూట్ అవడంతో హటాత్తుగా మంటలు అంటుకొని క్షణాలలో వ్యాపించాయి.

దీంతో అప్రమత్తమైన చుట్టుపక్కల దుకాణ యజమానులు వెంటనే తమ దుకాణాల షట్టర్స్ మూసేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేశారు.

ఫైర్ ఇంజన్లతో పాటు అదనంగా మూడు వాటర్ ట్యాంకర్లు వెంట తెచ్చుకోవడం చాలా మంచి నిర్ణయం. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లలోని నీళ్ళు సరిపోకపోవడంతో వెంటనే వాటర్ ట్యాంకర్లలో నుంచి నీళ్ళు తీసుకొని మంటలు ఆర్పేశారు.

ఈ ప్రమాదం ప్రాణ నష్టం జరుగలేదు. కానీ భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా అమీర్ పేట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  

Related Post