తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల ధరలు పెంచాబోతున్న సంగతి తెలిసిందే. కనుక ఈ విషయం ముందుగా ప్రకటించి ప్రజల కోసం ఓ 10-15 రోజులు సమయం కూడా ఇచ్చింది. ఈ నెల 5 నుంచి భూముల ధరలు పెంపు అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.
ఈసారి పూర్తి శాస్త్రీయంగా, పారదర్శకంగా అధ్యయనం చేయించిన తర్వాత భూముల ధరలు హేతుబద్దంగా సవరించామని చెప్పారు. అయితే మార్కెట్ ధరలను బట్టి కొత్త ధరలు ఉంటాయంటూ బాంబు పేల్చారు.
ఇంతకాలం మార్కెట్ ధరకు, ప్రభుత్వ ధరకు మద్య చాలా అంతరం ఉంది. కనుక మార్కెట్ ధర గజం లక్ష రూపాయలు పలుకుతున్నప్పటికీ, ప్రభుత్వం ధర రూ.25-35,000 ఉన్నట్లయితే అదే ధరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ ధరల వ్యత్యాసం వలన మిగిలిన సొమ్ము బ్లాక్ మనీగా మారిపోతోంది. కనుక దానిని కట్టడి చేసేందుకు మార్కెట్ ధరలకు దగ్గరగా ప్రభుత్వ ధర నిర్ణయించి ఉంటే సామాన్య ప్రజలకు ఇక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయడం కూడా కష్టమవుతుంది.
కనుక ఒకేసారి అంత పెంపు ఉండకపోవచ్చుఒకే ప్రాంతంలో ఉండే అన్ని ప్లాట్ల ధరలు సరిసమానంగా ఉండేలా మార్పులు చేశామని చెప్పారు.
జూన్ 5 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని మంత్రి పొంగులేటి చెపుతున్నారు. కనుక ననేడో రేపో సవరించిన ధరల జాబితా విడుదల చేస్తే ఏ మేరకు పెంచారో స్పష్టమవుతుంది.