తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గంట మ్రోగింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
ఈ ఎన్నికలు రెండు దశలలో జరుగుతాయి. మొదటి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. కనుక ఈ ప్రకారం మొదటి దశ ఎన్నికలకు అక్టోబర్ 9న, రెండో దశ ఎన్నికలకు అక్టోబర్ 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
వీటిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ముగుస్తుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున సోమవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టాల్సిందిగా ఆదేశించామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని తెలిపారు.