టిజిపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నియామక పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తూనే ఇప్పుడు గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. నిన్న (సోమవారం) ప్రోవిజినల్ సెలక్షన్ జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో ఎంపికైన అభ్యర్ధులకు నేటి (మంగళవారం) నుంచే వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలుపెట్టింది. దీనికి అక్టోబర్ 10 సాయంత్రం 5.30 గంటల వరకు గడువు ఇచ్చింది.
గ్రూప్-3లో మొత్తం 1,365 పోస్టులకు మొత్తం 5,36,400 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది నవంబర్ 17,18 తేదీలలో జరిగిన ఈ రాత పరీక్షలకు 2.67 లక్షల మంది హాజరయ్యారు. వాటి జనరల్ ర్యాంకింగ్ ఈ ఏడాది మార్చి 14న విడుదల చేసింది. దాని ప్రకారం నిన్న ప్రోవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల చేసి, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభించింది.
టిజిపీఎస్సీ గ్రూప్-1,2,3 ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయడంతో దీని కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభ్యర్ధులు చాలా సంతోషిస్తున్నారు.