హైకోర్టు డివిజన్ బెంచ్‌లో టిజిపీఎస్సీ పిటిషన్‌

September 17, 2025


img

ముందే చెప్పుకున్నట్లుగా గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంపై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ  టిజిపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో నేడు పిటిషన్‌ దాఖలు చేసింది.   

ఈనెల 9న సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పులో గ్రూప్-1 ఫలితాలు, మెరిట్ ర్యాంకింగ్ జాబితాని రద్దు చేసింది. మళ్ళీ మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం చేయాలని ఆదేశించింది.

సంజయ్ సింగ్ వర్సస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే మాన్యువల్ పద్దతిలో మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించాలి.

ఒకవేళ అలా కుదరదనుకుంటే గత ఏడాది అక్టోబారులో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి, ఈ ప్రక్రియని 8 నెలల్లోగా పూర్తిచేయాలని సింగిల్ జడ్జ్ ఆదేశించారు. 

కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నాక ఈవిదంగా చేస్తే చాలా జాప్యం జరుగుతుంది. పైగా పోటీ పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధులకు తీరని అన్యాయం జరుగుతుంది. కనుక సింగిల్ జడ్జ్ తీర్పుని కొట్టివేయాలని కోరుతూ టిజిపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించింది. 

టిజిపీఎస్సీ పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం తీర్పు చెపుతుందో అని అర్హత సాధించినవారితో పాటు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పిటిషన్స్ వేసినవారు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


Related Post