తెలంగాణ ప్రభుత్వం 42 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన కొందరు ముఖ్య అధికారుల వివరాలు...
సందీప్ కుమార్ సుల్తానియాని పంచాయితీరాజ్ శాఖ నుంచి ఆర్ధికశాఖకు బదిలీ చేసి ముఖ్యకార్యదర్శిగా నియమించింది.
ప్రస్తుతం జాయింట్ మెట్రోపాలిటన్ కమీషనర్‌గా ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ కమీషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం పాఠశాల విద్య కమీషనర్‌గా చేస్తున్న శ్రీదేవసేనకు కాశాల, సాంకేతిక విద్య కమీషనర్‌గా నియమితులయ్యారు.
జీహెచ్‌ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రాస్‌ను విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దాంతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎందీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎస్ఏఎం రిజ్వీని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.
సర్పారాజ్ అహ్మద్ (జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్)ని హెచ్ఎండీఏ, మెట్రోపాలిటన్ కమీషనర్‌గా నియమితులయ్యారు.
పోస్టు కోసం వెయింటింగులో ఉన్న దాసరి హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు.
రవాణాశాఖ కమీషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, హౌసింగ్ శాఖల కార్యదర్శిగా నియమితులయ్యారు.
ప్రస్తుతం హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా చేస్తున్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాద్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్‌గా నియమితులయ్యారు.