లోక్‌సభ రెండవ దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

March 28, 2024


img

లోక్‌సభ రెండవ దశ ఎన్నికలకు గురువారం ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండో దశలో 12 రాష్ట్రాలలో 88 ఎంపీ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలలో 102 స్థానాలకు నామినేషన్లకు గడువు ముగిసింది. ఏప్రిల్‌ 19న మొదటి దశ పోలింగ్ జరుగనుంది.  

నేటి నుంచి రెండో దశలో ప్రకటించిన స్థానాలకు నామినేషన్స్ స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 4వరకు గడువు ఉంది. ఏప్రిల్‌ 5వ తేదీన (జమ్ము కశ్మీర్‌లో ఏప్రిల్‌ 6న) పరిశీలన చేసి ఏప్రిల్‌ 26న పోలింగ్ నిర్వహిస్తారు. 

రెండో దశలో మణిపూర్, త్రిపుర, జమ్ము కశ్మీర్, అస్సాం, బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతో పాటు మహారాష్ట్రలోని అకోలా (పశ్చిమ), రాజస్థాన్‌లోని బాగిడోరా అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలు నాలుగవ దశలో ఒకేసారి జరుగుతాయి. వీటితో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు కూడా అదే రోజున జరుగుతాయి. వీటికి ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌, 26న నామినేషన్స్ ఉపసంహరణ గడువు, పోలింగ్ మే 13న నిర్వహిస్తారు. 

మొత్తం ఏడు దశలలో ఎన్నికలు ముగిసిన తర్వాత లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓట్ల లెక్కింపు ఒకేసారి మే జూన్ 4వ తేదీన చేపట్టి వెంట వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.     



Related Post