ప్రచారం ముగిసింది ఇక పోలింగ్ ఏర్పాట్లు షురూ

November 28, 2023


img

ఈరోజు సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, పోలింగ్‌ కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులలో పాల్గొంటున్న 1.48 లక్షల మంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో 27,094 కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కువ  పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాలలో బయట కూడా వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనికీలలో రూ.737 కోట్లు నగదు పట్టుబడింది. దానిని ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. 

పోలింగ్ జరిగే రోజున (నవంబర్‌ 30)న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. సెలవు ఈయకుండా పనిచేయించుకొన్నట్లు తెలిస్తే ఆ సంస్థలపై చట్టపరమ్గా చర్యలు తీసుకోబడతాయి. 

ఎన్నికల సంఘం గుర్తించిన ఏ గుర్తింపు కార్డు, పత్రంతోనైనా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 

బుధ, గురువారం రెండు రోజులు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిది.

బుధవారం ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో బయలుదేరుతారు.  



Related Post