తెలంగాణ ఆలయాలలో ధూపదీప నైవేధ్యాలకు నగదు సాయం పెంపు

May 31, 2023


img

ఈరోజు రంగారెడ్డి జిల్లా శేలింగంపల్లి మండలంలోని గోపనపల్లిలో సిఎం కేసీఆర్‌ బ్రాహ్మణ సదన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విచ్చేసిన బ్రాహ్మణులు, వేద పండితులు, వివిద పీఠాధిపతులను ఉద్దేశ్యిచి ప్రసంగిస్తూ, రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం 2017 నుంచి ఏడాదికి రూ.100 ఆర్ధికసాయం అందజేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో వేదపాఠశాలల నిర్వహణ కొరకు ఏడాదికి రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఆలయాలలో నిత్య ధూపదీప నైవేధ్యాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.6,000 చొప్పున ఇస్తోందని దానిని రూ.10,000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నిరుపేద బ్రాహ్మణులకు ఇస్తున్న రూ.2,500 భృతిని ఇక నుంచి రూ.5,000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ భృతి పొందేందుకు ఇప్పటివరకు 75 ఏళ్ళు, పైబడినవారికి మాత్రమే ఈ భృతి లభిస్తుండేది. ఇక నుంచి 65 ఏళ్ళు, పైబడినవారికి కూడా దీనిని వర్తింపజేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు.

నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులకు ఐఐ‌టి, ఐఐ‌ఎమ్మెల్యే వంటి ఉన్నత విద్యాసంస్థలలో చదువుకొనేందుకు ఫీజ్‌ రీఇంబర్స్‌మెంట్‌ చేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. కంచి, శృంగేరి, విశాఖలోని శారదా పీఠం, ఉత్తరాది రాష్ట్రాలలో పీఠాధిపతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు కానీ కూతవేటు దూరంలో ఉన్న త్రిదండి చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించలేదు.


Related Post