నేటి నుంచి ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు

January 26, 2023


img

ఇంతకాలం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులు కేవలం ఇంగ్లీషు భాషలోనే ఉంటున్నాయి. కానీ నేటి నుంచి దేశంలో గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై. చంద్రచూడ్ ‘ఈ-సుప్రీంకోర్టు రిపోర్ట్స్’ (ఈ-ఎస్‌సీఆర్)ని నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.

ఇక నుంచి సుప్రీంకోర్టు తీర్పులని ప్రాంతీయభాషల్లో అనువదించి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇవి సామాన్య ప్రజలకి సైతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా వివిద రాష్ట్రాలలో న్యాయవాదులు, న్యాయ విద్యార్థులకి, కక్షిదారులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం 34 వేల సుప్రీంకోర్టు తీర్పులు ఆన్‌లైన్‌లో ఉన్నాయని వాటితో సహా ఇకపై వెలువరించే అన్ని తీర్పుల అనువాద ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.

ప్రస్తుతం వివిద భాషల్లో అందుబాటులో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రతుల సంఖ్య: హిందీలో: 1091, తమిళం:52, మలయాళం:29, తెలుగు:28, ఒడియా:21, కన్నడ:17, మరాఠీ:14, అస్సామి:4, పంజాబీ:4, ఉర్దూ:3, నేపాలి:3.


Related Post