ఆ నిందితుడిని కలిసిన మాట వాస్తవమే: ప్రొఫెసర్‌ కోదండరామ్‌

December 02, 2022


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులలో ఒకరైన సింహయాజీని టీజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కొన్ని నెలల క్రితం కలిశారనే వార్త బయటకువచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ, “నేను సింహయాజీని ఆరు నెలల క్రితం కలిసిన మాట వాస్తవమే. కానీ ఆయన కేవలం ఆద్యాత్మికవేత్తగానే నాకు తెలుసు. తిరుపతి నుంచి ఆయన హైదరాబాద్‌ వచ్చారని తెలిసి నేను వెళ్ళి కలిశాను తప్పితే ఎటువంటి రాజకీయ కారణాలతో కాదు. ఎందుకంటే ఆయనకి రాజకీయ పార్టీలతో, నాయకులతో సంబంధాలున్నట్లు అప్పుడు నాకు తెలీదు. ఆయనని కలిసినప్పుడు మేము కేవలం ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే మాట్లాడుకొన్నాము,” అని చెప్పారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయ్యి చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌లకి హైకోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. Related Post