తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకి నోటిఫికేషన్‌ జారీ

September 29, 2022


img

తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం బుదవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిజామాబాద్‌ జిల్లాలోని 14 గ్రామాలకు పోతంగల్ కేంద్రంగా మండలం ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 15 రోజులలోగా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.  రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వారాల క్రితమే కొత్తగా 13 మండలాలను ఏర్పాటుకి నోటిఫికేషన్‌ ఇచ్చినందున వాటిని మండలాలుగా ఖరారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్‌లో పోతంగల్ కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యర్ధనలు రావడంతో నిన్న దాని కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండ‌లాలల వివరాలు: 

సిద్దిపేట: అక్బర్‌ పేట్‌-భూంపల్లి, కుకునూరుపల్లి

సంగారెడ్డి: నిజాంపేట్‌

నల్లగొండ: గ‌ట్టుప్పల్‌

కామారెడ్డి: డోంగ్లి

జగిత్యాల: ఎండపల్లి, భీమారం

నిజామాబాద్: ఆలూర్‌, డొంకేశ్వర్‌, సాలూరా, పోతంగ‌ల్

మహబూబాబాద్: సీరోలు, ఇనుగుర్తి

మహబూబ్‌నగర్‌లో:  కౌకుంట్ల.


Related Post