అమ్మ చేతి కాఫీ గుళ్ళో దేవుడి ప్రసాదం వంటిది: మహేష్ బాబు

September 28, 2022


img

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా మహర్షి సినిమా రిలీజ్‌కు ముందు మహేష్ బాబు తన తల్లి గురించి అభిమానులతో చెప్పిన ఓ మాటను ఇప్పుడు వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మహేష్ బాబుకి సంతాపం తెలియజేస్తూ ఘట్టమనేని కుటుంబంలో అందరికీ అతనే ధైర్యం చెప్పాలని కోరుతున్నారు. 

మహర్షి సక్సస్ మీట్‌లో మహేష్ బాబు తన తల్లి గురించి అభిమానులతో ఏమన్నారంటే, “అమ్మంటే నాకు దేవతతో సమానం. ఆమె చేతితో ఇచ్చే కాఫీ దేవుడి ప్రసాదంతో సమానం. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ముందుగా అమ్మ దగ్గరకి వెళ్ళి ఆమె ఆశీర్వచనం తీసుకొంటాను. ఆమె చేతితో ఇచ్చే కాఫీని మహాప్రసాదంగా స్వీకరిస్తాను. అమ్మ అశ్శీసులు ఉన్నందునే నేను ఇన్ని విజయాలు సాధించగలిగానని నమ్ముతున్నాను,” అని అన్నారు. Related Post