హుజూర్‌నగర్‌లో నేడు భారీ జాబ్‌ మేళా

September 28, 2022


img

సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌లో ఈరోజు (బుదవారం) భారీ జాబ్‌ మేళా జరుగబోతోంది. టాస్క్-రైజ్ అధ్వర్యంలో ఏడు ప్రైవేట్ కంపెనీలు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనబోతున్నాయని హుజూర్‌నగర్‌ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. పట్టణంలోని టౌన్ హాల్ సమీపంలోని  సాయిబాబా గుడివద్ద ఉదయం 9.30 గంటల నుంచి ఈ జాబ్‌ మేళా మొదలవుతుంది. ఈ జాబ్‌ మేళాలో టెక్ అవుట్స్ (అమెరికాకు చెందిన ఐ‌టి సర్వీసస్ అండ్ ప్రోడక్ట్ కంపెనీ), టాటా స్కై, ఏసీటి (యాక్ట్) ఫైబర్ నెట్‌, అపోలో ఫార్మసీ, నవతా ట్రాన్స్‌పోర్ట్, పీపుల్ ప్రైమ్, రోటో మేకర్ (యానిమేషన్ సంస్థ)లు పాల్గొనబోతున్నాయి.

విద్యార్హతలు: పదో తరగతి పాస్, ఇంటర్, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బీబీఏ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఐ‌టిఐ, పాలిటెక్నిక్ డిప్లొమా.

గమనిక: 2017 నుంచి 2022 లోపు ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ ఇంటర్వ్యూలకు అర్హులు.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌టో పాటు, వాటి జిరాక్సు కాపీలు, తాజా బయోడేటా, ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా వెంటతెచ్చుకోవలసి ఉంటుంది.  

    


Related Post