అశ్వారావుపేటలో గిరిజనులపై పోలీసుల లాఠీఛార్జ్

June 27, 2022


img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో రామన్న గూడెంకు చెందిన గిరిజనులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామన్న గూడెం సర్పంచ్ స్వరూప అధ్వర్యంలో 200 మంది గిరిజన కుటుంబాలు సోమవారం ఉదయం ప్రగతి భవన్‌కు పాదయాత్రగా బయలుదేరారు. 

ఈవిషయం తెలుసుకొన్న అశ్వరావుపేట టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదివారం రాత్రి రామన్న గూడెంకు వెళ్ళి గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని కానీ కొంత సమయం అవసరమని చెప్పారు. కానీ ఇప్పటికే దశాబ్ధాలపాటు వేచిచూశామని, ఇక ఆగే ప్రసక్తే లేదని చెపుతూ ఈరోజు తెల్లవారుజామున రామన్న గూడెంకు చెందిన సుమారు 200 మంది గిరిజనులు తమ కుటుంబాలతో సహా హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరారు. 

పోలీసులు వారిని వాగొడ్డి గూడెం వద్ద అడ్డుకొని వెనక్కు తిప్పి పంపే ప్రయత్నం చేశారు. కానీ వారు ముందుకు సాగుతుండటంతో పోలీసులు వారిని బలవంతంగా వ్యానులలో ఎక్కించే ప్రయత్నం చేశారు. దాంతో ఇరువర్గాలకు మద్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. గ్రామస్తులు మరింత ఆగ్రహంతో పోలీసులను ప్రతిఘటించారు. పోలీసులు రామన్న గూడెం సర్పంచ్ స్వరూపతో గిరిజన కుటుంబాలను అదుపులోకి తీసుకొన్నారు. 


Related Post