హైదరాబాద్‌కు మరో 50 ఏళ్ళ వరకు నీళ్ళకి కరువు ఉండదు: కేటీఆర్‌

May 14, 2022


img

శరవేగంతో విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకీ జనాభా పెరుగుతూనే ఉంది. దీంతో నగరం నలువైపులా వేగంగా విస్తరిస్తోంది. కనుక మరో 50 ఏళ్ళ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో సుంకిశాల ఇన్‌టెక్ వెల్ నిర్మిస్తోంది. దీనికి మంత్రి కేటీఆర్‌ ఈరోజు శంకుస్థాపన చేశారు.  

దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక్కడ పంప్‌హౌస్‌లో భారీ మోటర్లు, పంప్‌ సెట్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి నీటిని గొట్టాల ద్వారా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు 16 టీఎంసీల నీళ్ళు సరఫరా చేయాలనేది ప్లాన్. ఈ సుంకిశాల ఇన్‌టెక్ వెల్ నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

ఇది అందుబాటులోకి వస్తే మరో వరుసగా ఏడేళ్ళు కరువు వచ్చినా, మరో 50 ఏళ్ళవరకు జంట నగరాలకు తాగునీటికి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాలకు కూడా తాగునీటిని అందించే విదంగా దీనిని నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 



Related Post