నేడు బూర్జ్ ఖలీఫా టవర్స్‌పై బతుకమ్మ వీడియో ప్రదర్శన

October 23, 2021


img

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాక విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇటీవల న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద తానా అధ్యవార్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈరోజు దుబాయిలో ప్రపంచంలో కెల్లా ఎత్తైన బూర్జ్ ఖలీఫా టవర్స్‌పై బతుకమ్మ వీడియోలను ప్రదర్శించబోతున్నారు. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 9.40 గంటలకు మళ్ళీ 10.40 గంటలకు మరోసారి బూర్జ్ ఖలీఫా టవర్స్‌పై బతుకమ్మ వీడియో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపఠాన్ని సైతం బూర్జ్ ఖలీఫా టవర్స్‌పై ప్రదర్శిస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆ సంస్థ సభ్యులు, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, దుబాయిలో నివశిస్తున్న తెలంగాణవాసులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.   Related Post