తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

October 13, 2021


img

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియమ్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ ఆమోదంతో కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు వారి నియామకాలకు సంబందించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

జస్టిస్ ఏ. వెంకటేశ్వర రెడ్డి, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ పి.శ్రీసుద, జస్టిస్ ఎం.లక్ష్మణ్, జస్టిస్ డాక్టర్ జి.రాధారాణి, జస్టిస్ ఎన్‌ తుకారంజీ, జస్టిస్ సి. మాదవీ దేవి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 

వీరిలో ఎన్‌ తుకారంజీ- హైదరాబాద్‌, జస్టిస్ సి.మాదవీ దేవి-హైదరాబాద్‌, జస్టిస్ ఏ. వెంకటేశ్వర రెడ్డి-మహబూబ్‌నగర్‌, జస్టిస్ ఎం.లక్ష్మణ్-వికారాబాద్‌కు చెందినవారు కాగా జస్టిస్ సి.సుమలత-నెల్లూరు, జస్టిస్ పి.శ్రీసుధ-నెల్లూరు, జస్టిస్ డాక్టర్ జి.రాధారాణి-గుంటూరుకి చెందినవారు. 


Related Post