కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు నిర్మల్ సభకు

September 17, 2021


img

రాష్ట్ర బిజెపి అధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని ఎల్లపెల్లి క్రషర్ ఏరియాలో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ బహిరంగ సభ జరుగబోతోంది. దీనిలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నిర్మల్ రానున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చిన అమిత్ షా అక్కడి నుంచి హైదరాబాద్‌ వస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భీమన్నగుట్టకు చేరుకొంటారు. అక్కడ నిజాం కాలంలో వెయ్యి మంది గోండులను ఉరి తీసిన మర్రిచెట్టు ప్రాంతాన్ని సందర్శించి వారికి నివాళులు ఆర్పిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లపెల్లిలోని సభావేదికకు చేరుకొని తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు.     Related Post