తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

September 17, 2021


img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలు క్లుప్తంగా... 

• ఈనెల 24 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు

• ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన రోడ్ల మరమత్తులకు రూ.100 కోట్లు మంజూరు. 

• మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 15 శాతం, దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం కేటాయింపుకు ఆమోదం.

• హైదరాబాద్‌, నారాయణగూడాలో బాలికల వసతి గృహ నిర్మాణానికి 1,261 గజాలు కేటాయింపు.  

• హైదరాబాద్‌ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి.

• రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తిని 280 టన్నుల నుంచి 550 తన్నులకు పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలి. 

• పోడు భూముల సమస్య పరిష్కారానికి మంత్రి సత్యవతి రాథోడ్ ఛైర్మన్‌గా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. దీనిలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌ సభ్యులుగా ఉంటారు. 

• ధరణీ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. 

•  సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పధకాలకు ఆమోదం. 

• కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నృసింహసాగర్ జలాశయనిర్మాణానికి నాబార్డు నుంచి రూ.2051.14 కోట్లు రుణం తీసుకొనేందుకు ఆమోదం. 


Related Post