నేడు జయశంకర్ సార్ వర్ధంతి

June 21, 2021


img

తెలంగాణ సిద్ధాంతకర్తగా కీర్తి గడించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి ఈరోజు. అక్కంపేట గ్రామంలో ఆత్మకూరు మండలం వరంగల్ జిల్లాలో లక్ష్మీ కాంతారావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. సార్ చిన్నప్పటినుండి తెలంగాణ వివక్షకు గురవుతున్నదనే ఆలోచనతోనే ఉండేవారు. జయశంకర్ సార్ పాఠశాల స్థాయిలోనే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు అలుపెరగని పోరాటం చేశారు. 1969లో తొలిదశ ఉద్యమకాలంలో జయశంకర్ సార్ చాలాముఖ్య పాత్ర పోషించారు. మాలి దశ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌కు మార్గదర్శిగా, తెలంగాణ సిద్ధాంత కర్తగా వ్యవహరించారు . తెలంగాణ ఆశయసాధన కొరకు జయశంకర్ సార్ ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచిపోయారు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే 2011, జూన్‌ 21న క్యాన్సర్‌తో పోరాడి కన్ను మూశారు. జయశంకర్ సార్ మరణించినప్పటికీ ఆయన కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సిఎం కేసీఆర్‌ ఆయన పేరిట జయశంకర్ భూలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా సార్ కలలు కన్న బంగారి తెలంగాణను సాధిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ ఈరోజు వరంగల్‌ పర్యటన సందర్భంగా హన్మ‌కొండ‌లోని ఏక‌శిలా పార్కులో ఏర్పాటు చేసిన జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.


Related Post