నేటి నుంచి పాస్‌పోర్ట్‌ సేవలు షురూ

June 10, 2021


img

లాక్‌డౌన్‌ కారణంగా మే 12 నుంచి పోస్టాఫీసుల్లోని పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు మూతపడటంతో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకొనేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో మళ్ళీ పోస్టాఫీసులు...వాటిలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు కూడా తెరుచుకోనున్నాయి. నేటి నుంచి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించినందున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కొరకు ముందుగా స్లాట్ బుక్‌ చేసుకోవలసి ఉంటుంది.     Related Post