ఏపీకి టీఎస్‌ఆర్టీసీ బస్సులు బంద్‌: సునీల్ శర్మ

May 07, 2021


img

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 12 నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే ఇతర రాష్ట్రాల బస్సుల సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నంలోపుగా ఆంధ్రప్రదేశ్‌లో గమ్యస్థానాలు చేరుకోవడం తిరిగి రావడం రెండూ సాధ్యం కావు కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసి ఎండి తెలిపారు. అలాగే  ఏపీకి వెళ్లే ఆర్టీసీ బస్సుల ముందస్తు రిజర్వేషన్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం పూట కర్ఫ్యూను ఎత్తివేసే వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ తెలిపారు.Related Post