మే1 నుండి 18ఏళ్ళు పైబడిన అందరికీ వాక్సిన్

April 20, 2021


img

దేశవ్యాప్తంగా మే 1 నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌లు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతుండటంతో సోమవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం. ప్రభుత్వాసుపత్రులలో ఈ వ్యాక్సిన్లను ఉచితంగా వేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రం డబ్బు చెల్లించవలసిఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకొంటున్నవారు మొదటగా కోవిన్ మొబైల్ యాప్‌, వెబ్‌సైట్‌లో  రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 



Related Post