ఏ రాష్ట్రంలో ఎంత శాతం పోలింగ్ అంటే...

April 06, 2021


img

ఇవాళ్ళ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. అస్సాం శాసనసభకు నేడు చివరి విడత పోలింగ్ జరుగగా, పశ్చిమ బెంగాల్‌ శాసనసభకు 8 దశలలో నేడు మూడో దశ పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌ తప్ప మిగిలిన అన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 63.6 శాతం, కేరళలో 69.41  శాతం, పుదుచ్చేరిలో 72.47 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 75.64 శాతం, అస్సాంలో 75.53 శాతం పోలింగ్ నమోదైంది. 

తమిళనాడులో 234 స్థానాలకు మొత్తం 3,998 మంది పోటీ ఓపడగా, కేరళలో 140 స్థానాలకు 957 మంది , పుదుచ్చేరిలో 40 స్థానాలకు 337 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ మాస్క్ ధరించి సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాడు. 


పశ్చిమ బెంగాల్‌ 3వ దశలో 31 స్థానాలకు 205 మంది, అస్సోంలో చివరి దశ ఎన్నికలలో 40 స్థానాలకు 337 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. 

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఓట్లు మే 2వ తేదీన లెక్కించి ఆదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు.


Related Post