తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం లేదు: షర్మిళ

March 08, 2021


img

ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్‌ షర్మిళ హైదరాబాద్‌లోని తమ లోటస్ పాండ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతోమంది మహిళలకు మంత్రి పదవులు లభించాయి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కేవలం ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు లభించడానికి    ఐదున్నరేళ్ళకు పైగా సమయం పట్టింది. అన్నిటిలో మహిళలు సగం అయినప్పుడు వారి పట్ల పాలకులే ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నారో జవాబు చెప్పాలి. చట్టసభలలోనూ మహిళలకు సరైన ప్రాతిధ్యం లభించడం లేదు... ఉద్యోగాలలోనూ లభించడం లేదు. మరి అటువంటప్పుడు మహిళలకు ఏవిధంగా న్యాయం జరుగుతుంది? పాలకులు సమాధానం చెప్పాలి. మహిళల హక్కుల కోసం ఒక అక్కగా, చెల్లిగా, తల్లిగా నేను నిలబడతానని మీకు హామీ ఇస్తున్నాను. ఇక నుంచి నేను చేపట్టే ప్రతీ పనిలోనూ మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని హామీ ఇస్తున్నాను,” అని షర్మిళ అన్నారు. 

 తెలంగాణ ఏర్పడిన ఆరేళ్ళవరకు రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న షర్మిళ మరి ఈ ఆరేళ్ళలో ఒక్కసారి కూడా తెలంగాణవైపు...రాష్ట్రంలో మహిళలవైపు ఎందుకు తొంగిచూడలేదు?ఇప్పుడు హటాత్తుగా వచ్చి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు?అనే ప్రశ్నలకు షర్మిళ సమాధానాలు చెపితే బాగుండేది.


Related Post