ఆర్టీసీలో తాత్కాలిక నియామకాలు మాత్రమే!

October 14, 2019


img

గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్‌ఆర్టీసీ కార్మికులు అందరూ ‘సెల్ఫ్ డిస్మిస్’ అయినట్లేనని వారి స్థానంలో కొత్తవారిని నియమించుకొంటామని సిఎం కేసీఆర్‌ గట్టిగా చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆర్టీసీ నిన్న నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసి నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలవద్ద అభ్యర్ధుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే వారిని శాస్విత ప్రాతిపదికన కాక తాత్కాలికంగానే ఉద్యోగాలలోకి తీసుకొంటున్నామని స్పష్టం చేసింది. డ్రైవర్లకు రోజుకు రూ.1,500 కండక్టర్లకు రోజుకు రూ.1,000 చొప్పున చెల్లిస్తామని తెలియజేసింది. ఆర్టీసీలో శాస్విత ప్రాతిపదికన నియామకాలు చేపట్టకపోవడం గమనిస్తే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగించడం అసంభవం అని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం గ్రహించినట్లే ఉన్నారు. కానీ తాత్కాలిక ఉద్యోగులను నియమించుకొని వారితో బస్సులు నడిపించగలిగితే ఆర్టీసీ కార్మికులు ఎంతకాలం సమ్మె చేసినా ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఆర్టీసీ కార్మికులపై మాత్రం నానాటికీ ఒత్తిడి పెరిగిపోతుంటుంది. కనుక ఏదో ఓ రోజు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో రాజీ పడకతప్పదు. బహుశః ఈ ఆలోచనతోనే ఆర్టీసీలో తాత్కాలిక నియమకాలు చేపట్టినట్లు భావించవచ్చు.


Related Post