అవును! గజం ధర రూ.2.98 లక్షలు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 7వ ఫేజ్‌లో ఖాళీగా పడున్న 18 ప్లాట్లని హెచ్ఎండిఏ బుధవారం వేలం వేసింది. వాటిలో 151 చదరపు గజాలు విస్తీర్ణం ఉన్న ప్లాట్ నంబర్: 22కి వేలంపాటలో గజం రూ.2.98 లక్షలు పలికింది. 151 చదరపు గజాల స్థలానికి రూ. 4,52, 72,160 చెల్లించి ఓ వ్యక్తి సొంతం చేసుకోగా, 292 గజాల విస్తీర్ణం ఉన్న ప్లాంట్‌లో నంబర్: 19ని గజానికి రూ.2.88 లక్షల చొప్పున రూ.8,40,96,000 వచ్చింది. ఈ 18 ప్లాట్లలో 6,236 గజాలణు వేలం వెయ్యగా ప్రభుత్వానికి రూ.141 కోట్ల 36,89,100 ఆదాయం వచ్చింది.
కేసీఆర్ హయంలో కోకాపేట వద్ద ఎకరం రూ.1.10 కోట్లు పలికితే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కూకట్‌పల్లిలోనే గజం రూ.2.98 లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన సామాన్యుల సొంత ఇల్లు కల పగటికలగానే మిగిలిపోతుందేమో?