తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావుగారు ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని గాడిన పెట్టిన గొప్ప మేధావి. ఆయన బహుభాషా కోవిదుడు, గొప్ప రచయిత కూడా. తెలంగాణ సాయుధ పోరాటాల గురించి అయన వ్రాసిన కధ ఆధారంగా ఇప్పుడు సినిమా రాబోతోంది. ప్రముఖ రచయిత స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ కుమారడు ముళ్ళపూడి వరా దర్శకత్వంలో ‘గొల్ల రామవ్వ’ పేరుతో ఈ సినిమా నిర్మించబోతోంది.
సుచేత డ్రీమ్ వర్క్స్ బ్యానర్‌పై ఈటీవీ విన్ సమర్పణలో రాఘవేంద్రవర్మ (బుజ్జి), రామ్ విశ్వాస్, హనూర్కర్ కలిసి గొల్ల రామవ్వ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి గొల్ల రామవ్వగా దీనిలో గొల్ల రామవ్వగా నటిస్తున్న తాళ్ళూరి రామేశ్వరి ఫస్ట్ లుక్ పోస్టర్లు రెండు నిన్న విడుదల చేశారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వరా ముళ్ళపూడి, సంగీతం:సాయి మధుకర్, కెమెరా: గంగామోని శేఖర్, ఎడిటింగ్: రాఘవేంద్ర వర్మ చేస్తున్నారు.