బ్రోచేవారెవరురా : రివ్యూ

June 28, 2019
img

రేటింగ్ : 3/5

కథ :

డైరక్టర్ గా స్టార్ హీరోయిన్ షాలిని (నివేదా పేతురాజ్) తో సినిమా చేయాలని అనుకుంటాడు విశాల్ (సత్యదేవ్). ఆమె కోసం ఓ కథ చెబుతాడు. మరోపక్క రాహుల్ (శ్రీవిష్ణు), రాకీ (ప్రియదర్శి), ర్యాంబో (రాహుల్ రామకృష్ణ) ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ 3 సార్లు ఇంటర్ ఫెయిల్ అయిన వీరితో ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కూతురు చిత్ర (నివేదా థామస్) స్నేహం చేస్తుంది. ఈలోగా ఆమె సమస్యను సాల్వ్ చేసే క్రమంలో ఈ ముగ్గురు చిక్కుల్లో పడతారు. ఆ సమస్యల నుండి వీళ్లు ఎలా బయట పడ్డారు. ఈ ముగ్గురు కథకు విశాల్ కు సంబంధం ఏంటి..? చివరకు వీరి  కథ ఎలా ముగిసింది అన్నది సినిమాలో చూడాలి. 

విశ్లేషణ :

మెంటల్ మదిలో సినిమాతో లవ్ స్టోరీని తన మార్క్ గా తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈసారి కామెడీ, క్రైం జానర్ ఎంచుకున్నాడు. సినిమాను కామెడీగా మొదలు పెట్టి క్రం జానర్ లో తీసుకెళ్లాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ ఆడియెన్స్ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో అయినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది.

అయితే ప్రీ క్లైమాక్స్ బాగున్నా క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో ఉండదు. కాస్టింగ్ పర్ఫార్మెన్స్ వీటిలో దర్శకుడు పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సినిమా కథ కొత్తగా లేకున్నా దర్శకుడు రాసుకున్న కథనం ఇంప్రెస్ చేస్తుంది. సినిమా ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్న ఎక్సైటింగ్ కంటిన్యూ అయ్యేలా చేశాడు.

యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను నచ్చే అవకాశం ఉంది. అయితే మాస్ అండ్ కమర్షియల్ అంశాలు. ఊర మాస్ ఫైట్స్ ఇష్టపడే వారికి ఇది పెద్దగా రుచించదు. ఫైనల్ గా మెంటల్ మదిలో తర్వాత వివేక్ ఆత్రేయ మరో సక్సెస్ ఫుల్ సినిమా చేశాడని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురిది ఈక్వల్ రోల్ అని చెప్పొచ్చు. సినిమాలో వీళ్లు ముగ్గురు బాగా చేశారు. సత్య దేవ్ పాత్ర ఆకట్టుకుంది. ఇక నివేదా థామస్ నటన సినిమాకు మరో ఆకర్షణ అని చెప్పొచ్చు. నివేదా పేతురాజ్ చిన్న పాత్రకే పరిమితమైంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే.. వివేక్ సాగర్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు బిజిఎం బాగా ఇచ్చాడు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ అలరించింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ కథ, కథనాలు ఇంప్రెస్ చేశాయి. అక్కడక్కడ లాజిక్స్ మిస్సైనా ఓవరాల్ గా సినిమాను మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు ఎంత అవసరమో అంత పెట్టారు.

ఒక్కమాటలో :

బ్రోచేవారెవరురా.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్..!  



Related Post