మజిలీ రివ్యూ & రేటింగ్

April 05, 2019
img

రేటింగ్ : 3/5

అక్కినేని నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబినేషన్ లో లవ్ అండ్ ఎమోషనల్ మూవీగా వచ్చిన సినిమా మజిలీ. షైన్ స్క్రీన్ పిక్చర్స్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో చైతు సరసన సమంత, దివ్యాన్ష కౌశిక్ నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : 

రైల్వే టిసి రావు రమేష్ కొడుకైన పూర్ణ (నాగ చైతన్య) క్రికెట్ లో గొప్ప స్థాయికి వెళ్లాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఓ గొడవతో పరిచయమైన అన్షు (దివ్యాన్ష కౌశిక్)తో స్నేహం పెరిగి ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. నేవీ ఆఫీసర్ కూతురైన అన్షుని పూర్ణ నుండి దూరం చేస్తారు. ప్రేమ విఫలమవడంతో కెరియర్ కూడా పాడుచేసుకుంటాడు పూర్ణ. అలా ఉన్న పూర్ణని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న శ్రావణి (సమంత) పెళ్లాడుతుంది. పూర్ణ ఏం చేసినా సరే ఎప్పటికైనా తన కోసం మారుతాడని భావించే శ్రావణి పూర్ణ కోసం ఏం చేసింది..? శ్రావణి తన మీద చూపిస్తున్న ప్రేమని పూర్ణ ఎప్పుడు గుర్తించాడు..? పెళ్లైనా అన్షు జ్ఞాపకాలతో ఉండే పూర్ణకి శ్రావణి ఎలా దగ్గరవుతుంది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

నిన్నుకోరి సినిమాతో తెలిసిన కథను కొత్తగా ప్రేక్షకులకు చెప్పిన దర్శకుడు శివ నిర్వాణ. ఈసారి కూడా తెలిసిన కథే కాని కొత్త ట్రీట్మెంట్ తో మజిలీ తీశారు. ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయిన హీరోకి మరో అమ్మాయితో పెళ్లడవడం ఆమెను ముందు చీదరిచుకుని తర్వాత హీరోపై ఆమె చూపిస్తున్న ప్రేమని గుర్తించడం లాంటి సినిమాలు వచ్చాయి.

అయితే మజిలీలో చైతు, శ్రావణి, అన్షు పాత్రల ద్వారా గొప్ప కథే చెప్పగలిగాడు శివ నిర్వాణ. ప్రేమ విఫలమైందని ఒక చోటే జీవితం ఆగిపోదు. అయితే తన వల్ల చుట్టుపక్కన ఉన్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు. తన మీద కొండంత ప్రేమ చూపించే వారికి కొద్దిపాటి ప్రేమ తిరిగి చూపిస్తే ఎలా ఉంటుంది లాంటి విషయాలు ఇందులో ఉన్నాయి. 

దర్శకుడు కథ, కథనాల్లో అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా క్లియర్ గా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అండ్ ఎమోషనల్ జర్నీగా సాగగా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అన్షు కూతురు మీరా వచ్చి పూర్ణ, శ్రావణిలతో ఉండటం లాంటివి కొద్దిగా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఫైనల్ గా యూత్, ఫ్యామిలీ ఇద్దరిని మెప్పించే సినిమా అవుతుంది. 

నటన, సాంకేతికవర్గం :

నాగ చైతన్య పూర్ణ పాత్రలో నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. ఇన్నేళ్లె కెరియర్ లో చైతు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మజిలీలోనే అని చెప్పొచ్చు. సమంత కూడా చాలా మంచి అభినయం కనబరచింది. సినిమాలో చైతు, సమంత సీన్స్ చాలా బాగున్నాయి. దివ్యాన్ష కౌశిక్ కూడ బాగానే చేసింది. రావు రమేష్, పోసాని పాత్రలు అలరించాయి. సుబ్బరాజు నెగటివ్ రోల్ ఇంప్రెస్ చేశాడు. సుహాస్, సుదర్శన కూడా అలరించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. స్క్రీన్ పై చైతు, సమంత, దివ్యాన్ష కౌశిక్ లు బాగా కనిపించారు. గోపి సుందర్ మ్యూజిక్ అలరించింది. తమన్ బిజిఎం కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తం వైజాగ్ లోనే చుట్టేశరి. కథ, కథనాల్లో దర్శకుడు పనితీరు మెచ్చుకోదగినట్టుగా ఉంది.

ఒక్కమాటలో :

ప్రేమ.. విరహం.. రెండిటి సమపాళ్లతో వచ్చిన మజిలీ..!   

Related Post