ఎన్.టి.ఆర్ మహానాయకుడు రివ్యూ & రేటింగ్

February 22, 2019
img

రేటింగ్ : 2.5/5

కథ :

ఎన్.టి.ఆర్ కథానాయకుడు పార్టీ ఎనౌన్స్ మెంట్ తో ముగుస్తుంది. అయితే ఎక్కడ ముగించారో అక్కడే మొదలు పెట్టాడు. పార్టీ పెట్టడం ఆ వెంటనే అధికారం చేజిక్కించుకోవడం.. ప్రజల కోసం ఎన్.టి.ఆర్ పథకాలు అందరిని మెప్పిస్తాయి. ఈ టైంలో ఎన్.టి.ఆర్ పక్కనే ఉంటూ పార్టీలో కీలక నేతగా మారతాడు చంద్రబాబు నాయుడు. అయితే నాదెండ్ల భాస్కర్ రావు మాత్రం ఎన్.టి.ఆర్ వెన్నుపోటు పొడిచేలా ఆయన అమెరికా వెళ్లగానే సిఎం అవుతాడు. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్.టి.ఆర్ మళ్లీ ప్రజల్లోకి చైతన్య రథంపై వెళ్లి మరళ సిఎం అవుతాడు. ఎన్.టి.ఆర్ సతీమణి బసవతారకం మరణంతో సినిమా ముగుతుస్తుంది.

విశ్లేషణ :

ఎన్.టి.ఆర్ సిని జీవితం గురించి ఎవరికి తెలియక పోవచ్చు ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో ఇదే చూపించారు. అయితే అందులో ఎమోషన్ మిస్సవడం వల్ల సినిమా మెప్పించలేదు. అయితే ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానం గురించి అందరికి తెలుసు. తెలిసిన కథను క్రిష్, బాలకృష్ణ తమకు నచ్చినట్టుగా తెరకెక్కించారు.

ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రస్థానంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే సినిమాలో చంద్రబాబు నాయుడిని హీరో చేసి చూపించారు. అయితే ఎన్.టి.ఆర్ చివరి రోజుల్లో అతనికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చేసిన పనులు అందరికి తెలిసినవే. వాటిననంటిని కప్పిపుచ్చి బసవతారకం మరణం వరకు కథ అనుకుని అప్పటివరకు చంద్రబాబు నాయుడు ఎన్.టి.ఆర్ కు సపోర్ట్ గా నిలవడం గురించి మాత్రమే సినిమాలో చూపించారు.

నందమూరి ఫ్యాన్స్ కు.. ఎన్.టి.ఆర్ అభిమానులకు మహానాయకుడు నచ్చుతుంది. అయితే సగటు సిని ప్రేక్షకుడు మాత్రం సినిమా మెప్పించదు. క్రిష్ దర్శకత్వ ప్ర్తిభ మెచ్చుకునేలా ఉన్నా మహానాయకుడులో కూడా ఏదో మ్యాజిక్ మిస్సైనట్టు అనిపిస్తుంది. 

నటన, సాంకేతికవర్గం :

ఎన్.టి.ఆర్ పాత్రలో బాలకృష్ణ అదరగొట్టారు. కథానాయకుడ్లో వయసులో ఉన్న ఎన్.టి.ఆర్ పాత్రలో అటు ఇటుగా ఉన్నా సెకండ్ పార్ట్ లో మాత్రం మెప్పించారు. విద్యా బాలన్ నటన ఆకట్టుకుంది. కళ్యాణ్ రాం తన తండ్రి హరికృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఏయన్నార్ గా సుమంత్, చంద్రబాబు పాత్రలో రానా మంచి నటన కనబరిచారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. కీరవాణి మ్యూజిక్ ఆకట్టుకుంది. బిజిఎం కూడా బాగా ఇచ్చాడు. ఇక క్రిష్ దర్శకత్వ ప్రతిభ బాగానే ఉన్నా మరోసారి మహానాయకుడు విషయంలో కూడా వాస్తవానికి దూరంగా సినిమా తీశాడని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. 

ఒక్కమాటలో :

అసంపూర్తిగా..ఎన్.టి.ఆర్ మహానాయకుడు..!


Related Post