గీతా గోవిందం రివ్యూ & రేటింగ్

August 15, 2018
img

రేటింగ్ : 3/5

కథ : 

చిన్నప్పటి నుండి చాలా పద్ధతిగా సంప్రదాయబద్ధంగా పెరిగిన విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) తను కలలో ఊహించుకున్న అమ్మాయి ఎదురుపడగానే ఆమెను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఐతే అలా కుదరదు కదా ఓ జర్నీలో అతను చేసిన పనికి నానా హంగామా అవుతుంది. తనతో మిస్ బిహేవ్ చేసిన విజయ్ గోవింద్, గీతా తన అన్నకి చెప్పే టైం లో విజయ్ గోవింద్ చెల్లికి గీత అన్నకి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ టైమ్లో గోవింద్ గురించి చెప్పి పెళ్లి ఆపడం ఎందుకని భావించిన గీత సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత గీత, గోవింద్ ను ఎలా ఆడుకుంది. అతని మీద ఎలా పగ తీర్చుకుంది. ఫైనల్ గా గీతా గోవింద్ ల కథ ఎలా ముగిసింది అన్నది సినిమా. 

విశ్లేషణ :

ఆంజనేయులు సినిమా నుండి రెండేళ్ల క్రితం వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా వరకు దర్శకుడిగా తన సత్తా చాటుతున్న పరశురామ్ గీతా గోవిందం సినిమాను అదే రేంజ్ లో తెరకెక్కించాడు. కథ చాలా సింపుల్ గా ఉన్నా కథనం ఎక్కడ బోర్ కొట్టకుండా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మెప్పించాడు. కథ రొటీన్ గా అనిపించగా కథనంలో దర్శకుడు మ్యాజిక్ చేశాడు. 

కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ కు పూర్తిగా డిఫరెంట్ క్యారక్టరైజేషన్ సినిమాకు హెల్ప్ అయ్యింది. మొదటి భాగం వేలెత్తిచూపించడానికి లేదు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త స్లో అవుతుందనిపిస్తుంది తప్ప సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. అంతేకాదు యూత్ ఫుల్ యాస్పెక్ట్స్ లో కథనం ఉండటం వల్ల సినిమాను వారు బాగా ఎంజాయ్ చేస్తారు.

నటన, సాంకేతికవర్గం :

అర్జున్ రెడ్డి లాంటి డ్యాషింగ్ రోల్ చేశాక దానికి ఏమాత్రం సంబంధం లేని గోవిందం పాత్రలో విజయ్ అదరగొట్టాడు. ముఖ్యంగా తన ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసే డైలాగ్స్, యాటిట్యూడ్ అన్ని సూపర్బ్ గా కుదిరాయి. హీరోయిన్ గా రష్మిక పాత్ర కూడా అలరించింది. సినిమా మొదట్లో ఆమె కాస్త అటు ఇటుగా ఉన్నా క్లైమాక్స్ కు వచ్చేసరికి అందరికి నచ్చేస్తుంది. నాగబాబు, సుబ్బరాజు, అన్నపూర్ణ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ ఇలా అందరు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక గీతా గోవిందం టెక్నికల్ టీం విషయానికొస్తే.. మణికంథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. లీడ్ పెయిర్ ఇద్దరిని బాగా చూపించారు. గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణ. కథ రొటీనే అయినా కథనంలో దర్శకుడు పరశురాం మార్కులు కొట్టేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత అవసరమో అంత పెట్టేశారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ఒక్కమాటలో : 

గీతా గోవిందం.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్..!


Related Post