విజేత రివ్యూ & రేటింగ్

July 12, 2018
img

రేటింగ్ : 2.5/5

కథ :

రామ్ (కళ్యాణ్ దేవ్) ఓ మధ్యతరగతి కుర్రాడు. తండ్రి శ్రీనివాస రావు (మురళి శర్మ) కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఉద్యోగం చేస్తాడని భావించిన తండ్రికి ఆవారాగా తిరుగుతూ పెద్ద తలనొప్పిగా మారుతాడు రామ్. అతను దేనికి పనికిరాడని ఫిక్స్ అవ్వగా ఈలోగా శ్రీనివాస రావు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈలోగా అతని వెల్ విషర్స్ లో ఒకరు హీరోకి తన తండ్రి ఫ్లాష్ బ్యాక్ చెబుతారు. తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న కొడుకు ఏం చేశాడు..? అసలు శ్రీనివాస రావు ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? అన్నది సినిమా కథ.  

విశ్లేషణ : 

తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ మూవీస్ చాలానే వచ్చాయి. ఇంచుమించు ఈ కథ కూడా అలానే ఉంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. అతని మీద అంచనాలు.. అతనేమో తండ్రి ఆశలకు, ఆశయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఆరావాగా తిరగడం తర్వాత తప్పు తెలుసుకుని హీరోగా మారడం లాంటిదే ఈ సినిమా కథ.   

కథ పాతదే కదా అనుకుంటే కథనం కూడా అదే పాత పద్ధతిలో కొనసాగించాడు దర్శకుడు రాకేష్ శషి. ఎక్కడ కొత్తగా అనిపించదంటే నమ్మాలి. పాత కథ కథనాలనే కొత్త కాస్టింగ్ తో తీసినట్టు అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుట్ అయ్యాయి. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా అనిపించదు.

ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ హీరో అనగానే యాక్షన్ సినిమాతో డెబ్యూ ఇవ్వకుండా మనసుని తాకే సినిమాగా వచ్చిన విజేత ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేశాడు. వారికి కనెక్ట్ అయితే మాత్రం సినిమా సక్సెస్ అయినట్టే. 

నటన, సాంకేతిక వర్గం:

మొదటి సినిమా కాబట్టి కళ్యాణ్ దేవ్ లో బెరుకు కనబడుతుంది. మెగా కాంపౌండ్ నుండి వచ్చే హీరో ఇమేజ్ కు భిన్నంగా కూల్ మూవీతో వచ్చాడు కళ్యాణ్ దేవ్. తండ్రిగా మురళి శర్మ నటన ఆకట్టుకుంది. సినిమాలో కళ్యాణ్ దేవ్ పాత్ర కన్నా మురళి శర్మ పాత్ర ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మాళవిక నాయర్ కు కొద్ది పాత్రే ఇచ్చారు. సినిమాలో ఆమెని సరిగా వాడుకోలేదు. నాజర్, తణికెళ్ల భరణి పాత్రలు మెప్పించాయి. హీరో స్నేహితులుగా సుదర్శన్, మహేష్ మిగతా వారు ఆకట్టుకున్నారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. విజేతకు సెంథిల్ సినిమాటోగ్రఫీ ప్లస్ అని చెప్పొచ్చు. బాహుబలి కెమెరా మెన్ చిన్న సినిమాతో కూడా తన పనితనం చూపించాడు. మ్యూజిక్ డైరక్టర్ వినసొంపైన పాటలను ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సాయి కొర్రపాటి సినిమా రేంజ్ మరోసారి విజేత చూపించింది. దర్శకుడు కథ, కథనాలు కొత్తగా లేవు. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాయి.

ఒక్కమాటలో :

కళ్యాన్ దేవ్ 'విజేత'.. సగమే గెలిచాడు..! 


Related Post