అ! రివ్యూ & రేటింగ్

February 16, 2018
img

రేటింగ్ : 3/5 

కథ :

ఒక మనిషి తన జీవితంలో పొందే ప్రతి సందర్భన్ని తనకు తానుగా అనుభూతి పొందుతూ ఉండటం గొప్ప విషయం. కాలా (కాజల్) జీవితం అసతృప్తితో సాగించే అమ్మాయి. మీరా (రెజినా) డ్రగ్ అడిక్ట్ గా తన వెంట ఏదో పడుతుందని ఊహించుకునే అమ్మాయి. రాధా (ఈషా రెబ్బ) తను ప్రేమించిన వ్యక్తిని తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకునే ఆలోచన.. కృష్ణవేణి (నిత్యా మీనన్) రాధని పెళ్లిచేసుకోవాలనుకునే తెగింపు, శివ (అవసరాల శ్రీని) ఎప్పటికైనా టైం మిషన్ కనిపెట్టాలనుకునే తపన, తానే గ్రేటెస్ట్ మ్యుజిషియన్ అని ఫీలయ్యే యోగి (మురళి శర్మ), నాలా (ప్రియదర్శి) వంట రాకున్నా చెఫ్ గా పనిచేయాలనే ఆత్రుత. ఇలా ప్రతి క్యారక్టర్ కు ఓ అర్ధం పరమార్ధం ఉండేలా చేసి చివర్లో ఓ అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చిన సినిమా కథే అ!.

విశ్లేషణ :

పైన చెప్పిన కథా పాత్రలన్ని సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రవర్తిస్తుంటాయి. కాని ఫైనల్ గా ఒకచోట మాత్రం అందరిని సర్ ప్రైజ్ చేస్తాయి. కథ, కథనాలు పఫెక్ట్ గా రాసుకున్న డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ క్యూషన్ లో కాస్త తడబడినట్టు అనిపిస్తుంది. మొదటి భాగం అంతా ఏం జరగబోతుంది అన్న ఎక్సైటింగ్ వచ్చేలా చేసిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది.  

ప్రతి సీన్ కు ముందు సీన్.. ఆ తర్వాత సీన్ ఇలా లింక్ ఉంటూ వస్తుంది. అయితే సినిమా కథకు.. కథనానికి ముగింపుగా వచ్చిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణం. ట్విస్టులన్ని రివీల్ చేస్తూ వచ్చే ఈ కథనం నచ్చుతుంది. అయితే అక్కడక్కడ అర్ధం కాని విధంగా స్క్రీన్ ప్లే సాగుతుంది. 

సినిమాలో నటించిన వారంగా తమ పాత్రలకు న్యాయం చేశారు. అన్నిటిని మించి దర్శకుడు వారితో పనిచేయించుకున్న తీరు బాగుంటుంది. ముఖ్యంగా శ్రీనితో 20 ఏళ్ల తర్వాత తనే అంటూ వచ్చే పాత్ర కథనంలో ఇంట్రెస్ట్ తెస్తుంది. అయితే మల్టీప్లెక్స్ వరకు ఓకే కాని ఈ సినిమా బి, సి సెంటర్స్ లో మాత్రం కష్టమే అని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

కాజల్, రెజినా, ఈషా, నిత్యా, శ్రీని, ప్రియదర్శి, మురళి శర్మ. ఇలా అందరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాకు కాజల్, రెజినాలు ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. నాని, రవితేజలు కూడా చేప, మొక్కలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కాస్త జోష్ తెస్తుంది. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే అయితే అక్కడక్కడ ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉంది. కథ, కథనాలు కొత్తగా ఉన్నా కథనంలో కన్ ఫ్యూజన్ సాధారణ ఆడియెన్స్ కు అర్ధం కాదు. ఫైనల్ గా ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటో ప్రూవ్ అయ్యింది. నాని ఓ మంచి సినిమాను నిర్మించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా పర్వాలేదు.

ఒక్కమాటలో :

నాని నిర్మించిన అ!.. కథ, కథనాల్లో కొత్తదనం.. మంచి ప్రయత్నమే కాని..!


Related Post