చరణ్ కోసం ఆ ముగ్గురిని రిఫర్ చేసిన చిరు

December 05, 2019


img

రంగస్థలంతో నటుడిగా ఒక పదిమెట్లు పైకి ఎక్కాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ తో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్,  ఎన్టీఆర్ ఇద్దరు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటారు. RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. చరణ్ ఎవరితో చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. 

చరణ్ కోసం ముగ్గురు దర్శకులను వెతికి పెట్టాడట మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి, సందీప్ వంగ ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉందట. ఒకవేళ అలా కుదరకపోతే ధ్రువలానే ఏదైనా సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నారట. RRR తర్వాత చరణ్ ఎవరితో చేస్తాడు అన్నది తెలియాలంటే మరికొన్ని  రోజులు వెయిట్ చేయాల్సిందే.


Related Post

సినిమా స‌మీక్ష