అఖిల్ కోసం ఆమెను దించుతున్నారు..!

July 18, 2018


img

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అఖిల్, హలో సినిమాలు ఆశించిన రేంజ్ సక్సెస్ అవకపోవడంతో తొలిప్రేమతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు అఖిల్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మని దించుతున్నారు. 

బాలీవుడ్ లో హీరోయిన్ అయిన ఫరా కరామీ అఖిల్ తో చిందులేయనుంది. ఆల్రెడీ ఫరా తెలుగులో రాం చరణ్ ధ్రువ సినిమాలో నటించింది. ధ్రువలో అంత గుర్తింపు రాకున్నా అఖిల్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో తప్పకుండా పేరు తెచ్చుకునేలా కష్టపడుతుంది అమ్మడు. తొలిప్రేమ లానే క్రేజీ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు వెంకీ అట్లూరి. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష