భరత్ పై రాజమౌళి స్పందన..!

April 21, 2018


img

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కలిసి శ్రీమంతుడు తర్వాత చేసిన సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక సినిమా చూసిన మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించడం జరిగింది. సినిమా చూసిన జక్కన్న చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

ముఖ్యంగా పొలిటికల్ మూవీ, లోకల్ గవర్నెన్స్ అనే విషయాన్ని కమర్షియల్ గా చెప్పగలగడం గురించి కొరటాల శివను అభినందించారు. ఇక మహేష్ ప్రెస్ మీట్ లో నటన అద్భుతమని.. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అన్నారు రాజమౌళి. సినిమా కాస్టింగ్ బాగుందని.. మంచి సినిమా అందించినందుకు డివివి దానయ్యకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.



Related Post

సినిమా స‌మీక్ష