రంగస్థలంలో ఆ ఐదుగురు..!

March 12, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా క్రేజీ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ రంగస్థలంలో ఐదుగురి పాత్రలు ప్రాముఖ్యతగా ఉంటాయని తెలుస్తుంది. అందులో హీరో హీరోయిన్ ఉండగా మిగతా ముగ్గురు ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ అని అంటున్నారు.

లీడ్ పెయిర్ తర్వాత ఈ ముగ్గురికి సినిమాలో సమాన ఇంపార్టెన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా రీసెంట్ గా ఆదికు సంబందించిన లుక్ తో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. సుకుమార్ మార్క్ స్టైలిష్ సినిమాగా కాకుండా ఈ రంగస్థలం చాలా డీటైల్డ్ గా ఉంటుందని అంటున్నారు. మరి రంగస్థలం రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే ఈ నెల 30 దాకా వెయిట్ చేయాల్సిందే.Related Post

సినిమా స‌మీక్ష