రాష్ట్రంలో కొత్తగా 21 గ్రంధాలయాల ఏర్పాటు

November 16, 2017
img

తెలంగాణా రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యస్థీకరణ తరువాత కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను అన్నిటినీ కలిపి కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటికి అధనంగా ప్రతీ జిల్లాలో కొత్తగా పోలీస్ స్టేషన్లు, గ్రంధాలయాలు వగైరాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పాత పది జిల్లా కేంద్రాలలో ఇప్పటికే గ్రంధాలయాలు ఉన్నందున వాటిని ఆయ జిల్లా కేంద్ర గ్రంధాలయాలుగా మార్చుతూ, మిగిలిన 21 కొత్త జిల్లాలలో కూడా కొత్తగా జిల్లా కేంద్ర గ్రంధాలయాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


Related Post