ఉత్తమ ఉపాద్యాయులకు జాతీయ అవార్డులు

September 05, 2017
img

జాతీయ మానవవనరుల శాఖ అధ్వర్యంలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసి అధ్వర్యంలో మంగళవారం డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జాతీయ ఉపాద్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. దానిలో దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాద్యాయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులు అందజేశారు. తెలంగాణా నుంచి ఏడుగురు, ఆంధ్రా నుంచి తొమ్మిది మంది ఉత్తమ ఉపాద్యాయులుగా అవార్డులు అందుకొన్నారు. 

తెలంగాణా: కందుకూరి సురేందర్ (జగిత్యాల), విజయలక్ష్మి (నిజామాబాద్, కుల్సాపూర్), పి.రామారావు (ఏన్కూరు, ఖమ్మం),  నారాయణ (నాగర్‌కర్నూల్, పాల్కపల్లి), గుండేటి యోగేశ్వర్ (మంచిర్యాల), వల్గోటి కిషన్ (పాత ఎల్లాపూర్, నిర్మల్), కె.జనార్ధన్(నల్గొండ, మర్రిగూడ).

ఆంధ్రప్రదేశ్: జి.శ్రీనివాసరావు (గుంటూరు), సిహెచ్. శ్రీనివాసరావు (తూర్పు గోదావరి), ఎన్.విమలకుమారి (గుంటూరు), వై.చక్రవర్తి (విశాఖ), చాగంటి శ్రీనివాసరావు (గుంటూరు), బి. శంకర్ రావు (విజయనగరం), డి. ధర్మరాజు (పశ్చిమ గోదావరి), రెడ్డి లోకనాధ రెడ్డి (పశ్చిమ గోదావరి).  

Related Post