త్వరలో భువనగిరి కేంద్రీయ విద్యాలయంలో తరగతులు షురూ

August 29, 2017
img

ఇటీవల కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కొత్తగా 50 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో 16 విద్యాలయాలను తెలంగాణా రాష్ట్రానికి కేటాయించింది. అవి భువనగిరి, నిజామాబాద్ పట్టణం, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కుమరం భీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, వనపర్తి, వరంగల్ (రూరల్) లో ఏర్పాటు చేయబోతునట్లు ప్రకటించింది. వాటిలో మొట్టమొదటగా భువనగిరిలో ఏర్పాటు చేయబోతోంది. దాని భవన నిర్మాణం ఇంకా మొదలుపెట్టకపోయినా, తాత్కాలికంగా ఎంపిక చేసిన కళాశాలలో 2017-18 విద్యాసంవత్సరం నుంచే 1 నుంచి 5 వరకు తరగతులు మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగితే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేనాటికి స్వంత భవనాల నిర్మాణం పూర్తిచేసి దానిలోకి విద్యాలయాన్ని తరలించే అవకాశం ఉంది. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరిస్తే, కేంద్రప్రభుత్వం అవసరమైన నిధులు అందిస్తుంది. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో 32 కేంద్రీయ విద్యాలయాలు, 9జవహార్ నవోదయా విద్యాలయాలు ఉన్నాయి. 

Related Post