14 ప్రభుత్వ పాఠశాలలకు జాతీయ అవార్డులు

August 18, 2017
img

తెలంగాణాలో 14 ప్రభుత్వ పాఠశాలలు జాతీయ అవార్డులకు ఎంపిక అయ్యాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చా భారత్ పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా పరిశుభ్రత, పచ్చదనం పెంచాలనే ఉద్దేశ్యంతో  ప్రతీ ఏటా జాతీయ స్వచ్చ విద్యాలయ అవార్డులను ఇస్తోంది. 2016 సం.కి దేశవ్యాప్తంగా మొత్తం 172 ప్రభుత్వ పాఠశాలలో  14 తెలంగాణా రాష్ట్రం నుంచి ఎంపికయ్యాయి. అవార్డులతో బాటు ఒక్కో పాఠశాలకు రూ.50,000 నగదు బహుమతి, సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆ పాఠశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్ధులకు అభినందనలు తెలియజేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ప్రత్యేక అవార్డులకు ఎంపికయ్యాయి.  సెప్టెంబర్ 1న డిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ 14 ప్రభుత్వ పాఠశాలలకు అవార్డులు అందుకోనున్నాయి.

సిద్దిపేట : ఎంపియుపిఎస్ (ఇబ్రహీంపూర్)

కరీంనగర్‌ : టి.ఎస్.ఎం.ఎస్. (గంగాధర), ఎం.పి.యు.పి.ఎస్. (కొత్తపల్లి)

జగిత్యాల : జెడ్.పి.హెచ్.ఎస్. (అంబారీపేట)

మంచిర్యాల : టిఎస్.డబ్ల్యూ.ఆర్.ఎస్. బాలుర వార్డు నెంబర్‌-19 (బెల్లంపల్లి)

ఆదిలాబాద్‌ : ఎంపియుపిఎస్ (బండల్ నాగపూర్) 

సూర్యాపేట : జెడ్.పి.హెచ్.ఎస్. (అనంతారం)

జయశంకర్‌ : జెడ్.పి.హెచ్.ఎస్. (తిమ్మాపేట్‌)

వికారాబాద్‌ : ఎంపీపీఎస్ (బుద్ధారం)

మహబూబ్‌నగర్ : ఎంపీపీఎస్ (చౌటగడ్డ తండ)

ఖమ్మం : టి.ఎస్.ఎం.ఎస్. (కారేపల్లి), ఎంపీపీఎస్‌ (మల్లారం), టిఎస్.డబ్ల్యూ.ఆర్.ఎస్. (సింగారెడ్డి పాలెం), ఎంపీయూపీఎస్‌ (గండగలపాడు). 

Related Post