డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ షురూ

September 22, 2020
img

తెలంగాణలో డిగ్రీ కళాశాలలో రెండో దశ ప్రవేశాల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అర్హులైన విద్యార్దులు ఈనెల 25వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని దోస్త్ కన్వీనర్ ఆర్‌.లింబాద్రి తెలిపారు. దోస్త్ మొదటిదశలో అడ్మిషన్లు పొందిన విద్యార్దులు ఆన్‌లైన్‌లో సంబందిత కాలేజీలకు ఫీజులు చెల్లించి, ఈనెల 26లోగా ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పారు. మూడవ దశ ప్రవేశ ప్రక్రియ కూడా ముగిసేలోగా తరగతులు ఎప్పటి నుంచి  తరగతులు ప్రారంభిస్తారో విద్యార్దులకు తెలియజేస్తామని లింబాద్రి తెలిపారు. 

దోస్త్ 2,3వ దశ ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్ :      

రెండో దశ రిజిస్ట్రేషన్లు: 25–9–2020 వరకు

రెండో దశ వెబ్‌ ఆప్షన్లు:  26–9–2020 వరకు

స్పెషల్‌ కేటగిరీవారికి యూనివర్సిటీ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: 25–9–2020 

రెండో దశ సీట్లు కేటాయింపు: 1–10–2020

ఆన్‌లైన్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌:  1–10–2020 నుంచి 6–10–2020 వరకు

మూడో దశ రిజిస్ట్రేషన్లు:  1–10–2020 నుంచి 5–10–2020 వరకు

మూడో దశ వెబ్‌ ఆప్షన్లు:  1–10–2020 నుంచి 6–10–2020 వరకు  

స్పెషల్‌ కేటగిరీ వారికి యూనివర్సిటీ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌: 5–10–2020:  10–10–2020 వరకు. 

మూడో దశ సీట్లు కేటాయింపు: 10–10–2020 నుంచి 15–10–2020 వరకు

10-10-2020 నుంచి 15-10-2020 లోగా మూడు దశలలో సీట్లు పొందినా విద్యార్దులందరూ ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాలి. సంబందిత కాలేజీల నుంచి వారికి ఆన్‌లైన్‌లో జారీ అయిన సూచనల మేరకు కాలేజీలలో చేరాల్సి ఉంటుందనిదోస్త్ కన్వీనర్ ఆర్‌.లింబాద్రి తెలిపారు.

Related Post