జేఈఈ, నీట్ పరీక్షలు యదాతదంగా జరుగవలసిందే: సుప్రీంకోర్టు

September 04, 2020
img

దేశంలో కరోనా సర్వత్రా వ్యాపించి ఉన్నందున మరికొంతకాలం జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఆరు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు వేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కరోనాకు భయపడుతూ పరీక్షలను వాయిదా వేసుకొంటూపోతే విద్యార్దుల భవిష్యత్‌ దెబ్బ తింటుందని కనుక అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడమే సబబు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే జేఈఈ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి మొదలయ్యాయి కనుక ఈ దశలో వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. నీట్ పరీక్ష ఈ నెల 13న జరుగనుంది. 


Related Post