మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరు మార్పు

July 29, 2020
img

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఇవాళ్ళ డిల్లీలో జరిగిన.కేంద్రమంత్రివర్గం సమావేశంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరు మార్పుకు ఆమోదముద్ర వేశారు. ఇక నుంచి ఆ శాఖను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా వ్యవహరించనున్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ అంటే చాలా మంది అది ఏదో ప్రత్యేక శాఖ అని భావిస్తుంటారు. కానీ ఆ శాఖ ప్రధానంగా దేశంలో విద్యావ్యవస్థకు సంబందించిన అంశాలనే చూస్తుంటుంది కనుక దాని పేరును విద్యాశాఖగా మార్చాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది.  అది ఇన్నేళ్ళకు సాధ్యమైంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది.


Related Post