తెలంగాణలో ఓపెన్ విద్యార్దులందరూ పాస్

July 25, 2020
img

తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ దూరవిద్యావిధానం ద్వారా నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ విద్యార్దులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించవలసి ఉండగా కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడ్డాయి. రాష్ట్రంలో నేటికీ కరోనా తీవ్రత తగ్గనందున విద్యార్దులు పరీక్షలు వ్రాయకపోయినా ప్రతీ సబ్జెక్టులో కనీస పాస్ మార్కులు 35 చొప్పున ఇచ్చి పాస్ చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రధానకార్యదర్శి చిత్రా రామచంద్రన్ శుక్రవారం జీవో (నెంబర్: 12)ను జారీ చేశారు. దీంతో 43,000 మంది ఎస్ఎస్సీ, 32,000 మంది ఇంటర్ విద్యార్దులకు లబ్ధి పొందారు. ఒకవేళ విద్యార్దులెవరైనా తమ మార్కులను పెంచుకోవాలనుకొంటే త్వరలో నిర్వహించబోయే ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకావచ్చునని తెలిపింది. కరోనా పరిస్థితులను సమీక్షించి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.     


Related Post