హైదరాబాద్‌లో మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభం

July 24, 2020
img

మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆనంద్ మహీంద్రా, తెలంగాణ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో వర్చువల్ పాడతిలో మహీంద్రా యూనివర్సిటీని ప్రారంభించారు. హైదరాబాద్‌ శివార్లలో బహదూర్ పల్లిలో 130 ఎకరాలలో ఈ యూనివర్సిటీని నిర్మించారు. దీనికి ఆనంద్ మహీంద్రాయే వైస్ ఛాన్సిలర్‌గా వ్యవహరిస్తారు. మహీంద్రా యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యానందిస్తామని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్, న్యాయశాస్త్రం, మేనేజిమెంట్, లిబరల్ ఆర్ట్స్, డిజైన్, మీడియా తదితర విభాగాలలో డిగ్రీ, పీజీ, పిహెచ్‌డీ స్థాయి కోర్సులు ఉంటాయని ఆనంద్ మహీంద్రా తెలిపారు. మంత్రి కేటీఆర్‌ సూచించినట్లు సృజనాత్మకత, పరిశోధనకు ఈ యూనివర్సిటీలో ప్రాధాన్యం ఇస్తామని ఆనంద్ మహీంద్రా చెప్పారు.  


Related Post